బాలుడికి ఫోన్ చేసి మెచ్చుకున్న కమల హ్యారిస్

  • కమల హ్యారిస్ చిత్రాన్ని గీసిన 14 ఏళ్ల బాలుడు
  • సామాజిక మాధ్యమాల్లో పోస్ట్
  • కమలా హ్యారిస్ హర్షం  
అమెరికా ఉపాధ్యక్షురాలిగా పదవిని చేపట్టబోతున్న డెమొక్రాటిక్ పార్టీ నాయకురాలు కమల హ్యారిస్ చిత్రాన్ని 14 ఏళ్ల బాలుడు స్వయంగా గీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఆ చిత్రాన్ని చూసిన కమలా హ్యారిస్ హర్షం వ్యక్తం చేశారు. తన చిత్రాన్ని వేసిన బే ఏరియాకు చెందిన బాలుడు టైలర్ గార్డన్ కు ఆమె స్వయంగా ఫోన్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు.
 
 తనతో మాట్లాడుతున్నది కమల హ్యారిస్ అని తెలుసుకున్న ఆ బాలుడు ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. ఈ సందర్భంగా కమల ఆ బాలుడిపై ప్రశంసలు కురిపించింది. అద్భుత ప్రతిభ కనబర్చాడని మెచ్చుకున్నారు. అతడి కళాత్మకతతో తన హృదయం నిండిపోయిందని చెప్పారు.

అతడు తన చిత్రాన్ని వేయడమన్నది తనకు చాలా ప్రత్యేకమైన విషయమని తెలిపారు. ఈ  సంభాషణను కూడా టైలర్ ట్వీట్ చేశాడు. అది కూడా వైరల్ అవుతోంది. గతంలో తాను వేసిన చిత్రాన్ని కమల హ్యారిస్‌కు చేరుకునేలా సాయం చేసిన హిల్లరీ క్లింటన్ కూతురు చెల్సీ క్లింటన్‌కు ట్విట్టర్ ద్వారా టైలర్ ధన్యవాదాలు తెలిపాడు.

Kamala Harris
USA

More Telugu News